'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

NGKL: రైతులకు సరిపడా యూరియా అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ ఆధ్వర్యంలో బుధవారం బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఎదుట నిరసన చేపట్టారు. రెండు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.