భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి జీవిత ఖైది

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి జీవిత ఖైది

BHPL: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష తీర్పునిచ్చింది. 2020 ఆగస్టు 21న రేగులగూడెం గ్రామంలో భార్య స్వప్న, ప్రియుడి కళ్యాణ్‌తో కలిసి భర్త దేవేందర్‌కు మద్యంలో విషం ఇచ్చి హత్య చేశారు. దీనిపై విచారణ అనంతరం డ్రిస్టిక్ట్ సెషన్ జడ్జి సీహెచ్ రమేష్ బాబు గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.