భక్తుల జై.. నిర్మల్ నుంచి పూరీకి 2 బస్సులు
NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి పూరీ జగన్నాథ్ యాత్రకు బుధవారం రెండు ప్రత్యేక బస్సులు వెళ్లాయి. అన్నవరం, సింహచలం, అరసవెల్లి, పూరీ, కోణార్క్ మీదుగా యాత్ర సాగుతుందని, తిరిగి 9న చేరుకుంటాయని డీఎం పండరి తెలిపారు. భక్తుల ఆదరణతో 2 బస్సులు నిండాయన్నారు. మార్చిలో అయోధ్య, కాశీ, గోవా, తుల్జాపూర్ యాత్రలు ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.