తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేయాలి: సీపీఎం
కృష్ణా: పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని సీపీఎం నేత ఆర్ సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సీపీఎం కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. జీవో నెం.114 ప్రకారం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల సాయం వెంటనే చెల్లించాలని కోరారు. SPS స్కూలులో ఉన్న 207 మందికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులను అందించాలన్నారు.