ఆడే గజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ADB: నేరడిగొండ మండలంలోని కొరిటికల్ (కే) గ్రామ పంచాయతీ సర్పంచ్ భీం రావు, ఉప సర్పంచ్ నూర్ సింగ్‌లు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అధికార పార్టీలో ఉంటేనే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.