'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

HNK: కాజీపేట మండలం కడిపికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మత్తు పదార్థాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఎక్సైజ్ ఎస్సై చంద్రమోహన్ పాల్గొన్నారు.