ప్రధాన షెడ్యూల్ ముగిసింది: అబ్బవరం

ప్రధాన షెడ్యూల్ ముగిసింది: అబ్బవరం

నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీపై కిరణ్ అప్‌డేట్ ఇచ్చాడు. 'మ్యాజిక్ జరిగింది.. ప్రధాన షెడ్యూల్ ముగిసింది' అని తెలుపుతూ.. మూవీ టీంతో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఇక దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తోంది.