జనసేన నేత తండ్రి మృతి.. ఎమ్మెల్యే నివాళి

PLD: దుర్గి మండలం ముటుకూరుకి చెందిన జనసేన సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వర్లు గురువారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.