VIDEO: పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: రాజాం మండలం దోసరి రామినాయుడు వలస గ్రామంలో మంగళవారం మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి పాలకుల ఫొటోలను ముద్రించుకున్నారని.. ఇప్పుడు రాజముద్రతో చంద్రబాబు ఇచ్చారని పేర్కొన్నారు. 4 మండలాల్లో 11,604 పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.