'చిన్నారులలో అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలి'

MNCL: విద్యార్థులలో అభ్యాసన సామర్ధ్యాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని దండేపల్లి మండల ఎంఈవో దుర్గం చిన్నయ్య, దండేపల్లి పాఠశాల ఎంఈవో శ్రీనివాస్ సూచించారు. సోమవారం దండేపల్లి జడ్పీ పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్-టిఎల్ఎం మేలాను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యములతో విద్యార్థులకు త్వరగా పాఠాలు అర్థమవుతాయన్నారు.