నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం క్యూఆర్ కోడ్

సత్యసాయి: నేపాల్‌లో జరుగుతున్న విధ్వంసకాండలో ఇరుక్కున్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ టీఎస్ చేతన్ గురువారం తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు క్యూ ఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని.. రిజిస్టర్ చేసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.