ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో అలేఖ్య

ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో అలేఖ్య

MNCL: హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామానికి చెందిన మనుబోతుల అలేఖ్య బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న అలేఖ్య ప్రస్తుతం ర్యాలీ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలనే ధ్యేయంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.