వీటీడీఏ పనులు వేగం పెంచాలి: కలెక్టర్

SRCL: వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీటీడీఏ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీటీడీఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎక్కడి వరకు పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.