వాయు కాలుష్యం.. పర్యావరణ శాఖ కీలక నిర్ణయం

వాయు కాలుష్యం.. పర్యావరణ శాఖ కీలక నిర్ణయం

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకీ క్షీణిస్తున్న తరుణంలో పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పని చేసేవారిలో 50శాతం మంది ఇంటి నుంచే పని చేయాలని, మిగిలిన వారు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, ఫైర్ సిబ్బందికి మినహాయింపునిచ్చింది.