VIDEO: గోనెగండ్ల శివాలయంలో ప్రత్యేక పూజలు
గోనెగండ్లలోని కింది గేరి శివాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి ఆధ్వర్యంలో శివుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. నవగ్రహ, గణపతి పూజలతో పాటు శివుడికి అభిషేకం, ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.