VIDEO: పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో హుకుంపేట-చీడిపుట్టు మధ్యలో ఉన్న వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అడ్డుమండ, బారపల్లి, గడ్డికించుమండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండవాగులు దాటవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు.