ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఎస్సైకి వినతి

KRNL: వెల్దుర్తి ముస్లిం సోదరులు సెప్టెంబర్ 5న ప్రవక్త మహమ్మద్ జన్మదిన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఎస్సై అశోక్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం శాంతియుతంగా, క్రమశిక్షణతో జరిగేలా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్‌కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.