మెదక్ అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ బాధ్యతలు
మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం అధికారులతో సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతలపై సమీక్షించారు. భద్రాద్రి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన.. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.