పులిగడ్డ అక్విడేట్‌ను తాకుతూ వరద ప్రవాహం

పులిగడ్డ అక్విడేట్‌ను తాకుతూ వరద ప్రవాహం

కృష్ణా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేశారు. దీని ఫలితంగా కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ అక్విడేట్‌ను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.