'19న సింగరేణి భవన్ ముట్టడి'
MNCL: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 19న సింగరేణి భవన్‌ను ముట్టడించనున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొంటారని పేర్కొన్నారు.