ప్రజలు ఇళ్లలోనే ఉండాలి: ఎమ్మెల్యే

ప్రజలు ఇళ్లలోనే ఉండాలి: ఎమ్మెల్యే

NLR: దిత్వా తుఫాను తీవ్రత నేపథ్యంలో కావలి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి, అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ అయిన నేపథ్యంలో, భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఎమ్మెల్యే కోరారు.