ఎక్సైజ్ దాడులు.. బైక్, నాటుసారా స్వాధీనం

KRNL: జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. శుక్రవారం ఓర్వకల్లు మండలం కాల్వలో వెహికల్ చెక్ నిర్వహిస్తున్న సమయంలో నరేష్ నాయక్ అనే వ్యక్తి నాటుసారాతో బైక్‌పై వస్తుండగా పోలీసులను చూసి పారిపోయినట్టు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ వెల్లడించారు. అతని బైక్, 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.