జగ్గయ్యపేటలో మెగా జాబ్ మేళా
NTR: జగ్గయ్యపేటలోని జేఆర్సీ జూనియర్ కాలేజీలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ ప్రారంభించారు. ఈ మేళాలో 32 కంపెనీలు పాల్గొనడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఉద్యోగావకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.