కొండపై మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం
CTR: పుంగనూరులోని నెక్కొంది కొండపై అగస్తీశ్వర స్వామి దేవాలయంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి పర్వదినం మరుసటి రోజు సోమవారం కొండపై పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అన్నదానం చేపట్టారు. మహాదేవుని దర్శించి కోర్కెలు కోరితే తీరుతాయని భక్తుల విశ్వాసం.