అయినవిల్లిలో అర్ధరాత్రి భారీ త్రాచుపాము కలకలం
కోనసీమ: అయినవిల్లి మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ త్రాచుపాము కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంట్లోకి పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. ఉప్పలగుప్తంకి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా ఆయన వెంటనే చేరుకుని భారీ త్రాచు పామును చాకచక్యంగా బంధించి సురక్షిత ప్రాంతంలో వదలడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.