VIDEO: 'డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది'

సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ డంపింగ్ యార్డ్‌గా మారిపోయిందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. కొత్త బస్టాండ్ ఆవరణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు డిపో వద్ద చెత్త వేయడం వలన డంపింగ్ యార్డ్‌గా మారిపోయిందన్నారు. చెత్త, జంతు కళేబరాలతో చుట్టుపక్కన ఉన్నవారికి దుర్వాసన వెదజల్లుతోందని అని పేర్కొన్నారు.