పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు: వట్టి చెరుకూరు మండలంలోని చమళ్ళమూడి గ్రామంలో కౌలు రైతు మౌలా సాహెబ్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. ప్రభుత్వ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.