గెడ్డల వద్ద అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

PPM: జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా గడ్డల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. ఆ ప్రాంతాల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గెడ్డలు, చెరువులు నీరు పొంగి ప్రవహించే అవకాశాలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. రేయింబవళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.