రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇది మనిషిని మంచితనం, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వైపు నడిపించే పవిత్ర కాలమని ఆమె పేర్కొన్నారు. ముస్లింలు ఆకాశంలో నెలవంక దర్శనంతో రేపు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకోవడం విశేషమని తెలిపారు.