ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో శనివారం 116 మందికి రూ.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య కోసం కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.