తెగిపోతున్న విద్యుత్ తీగలు... సర్పంచ్‌కు వినతి
NLG: చిట్యాల మండలం వెలిమినేడులో ఓవర్‌లోడ్ లారీల వల్ల విద్యుత్ తీగలు తరచూ తెగిపోతుండటంతో ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రామాలయం పరిసరాల్లో సర్వీస్ వైర్లు తెగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే, ఈ సమస్యను పరిష్కరించి, లారీల రాకపోకలను నియంత్రించాలని బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ సర్పంచ్ చంద్రారెడ్డికి ఇవాళ వినతిని అందించారు.