కొత్త బగ్గాం హత్య కేసులో ఇద్దరి అరెస్టు

కొత్త బగ్గాం  హత్య కేసులో ఇద్దరి అరెస్టు

VZM : గజపతినగరం మండలం కొత్తబగ్గాం గ్రామంలో జరిగిన హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు బొబ్బిలి డిఎస్పి భవ్య శుక్రవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో తెలిపారు. గ్రామానికి చెందిన పసుపురెడ్డి శ్రీనును అతని తమ్ముడు చంటి, స్నేహితుడు గుమ్మడి రామచంద్రుడులు కోడి కత్తితో దాడి చేసి హత్య చేశారని చెప్పారు. సీఐ రమణ ఎస్.ఐ కిరణ్ కుమర్ పాల్గొన్నారు.