అభివృద్ధే మన ఆయుధం: మాజీ మంత్రి
SRPT: కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.