వివోఏలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే
W.G: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న వెలుగు వివోఏల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గం పరిధిలోని 126 మంది వెలుగు వివోఏలకు స్మార్ట్ ఫోన్లు ఇవాళ పంపిణీ చేశారు. సాంకేతికత సహాయంతో వారి పనిభారం తగ్గడమే కాకుండా లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగవంతంగా చేరువ అవుతాయన్నారు.