రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే

రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే

నల్లగొండ: నకిరేకల్ నుండి గురజాల వరకు రూ.10కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులకు బుధవారం ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు అభివృద్ధిని మరిచి దోచుకున్నారని, నేడు రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.