తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు

తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు

KKD: ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో రానున్న వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి కొరత, ఎండల తీవ్రత, MGNREGS ద్వారా ఉపాధి కల్పన, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు తదితర అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే వివరించారు.