ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు
ప్రకాశం: పామూరు పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులను మంగళవారం మార్కాపురం మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కే.ఎల్. రావు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సుల ఫిట్‌నెస్, పత్రాలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.