గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట-రామగుండం రైల్వే లైన్‌లో రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(43) మృతి చెందాడు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ప్రమాదానికి గురై మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది.