VIDEO: ఘనంగా కళ్యాణ కోదండరామ స్వామి కుంభాభిషేకం
CTR: ఐరాల మండలం చిగరపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ కోదండరామ స్వామి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య కుంభాభిషేక కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.