'ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి'
VZM: ఖరీఫ్ ధాన్యం సేకరణకు యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలని జేసీ సేదు మాధవన్ కలెక్టరెట్ సమావేశంలో తెలిపారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాకు -కామన్ వెరైటీ రూ.2369/- గ్రేడ్ ఏ రూ. -2389/ లుగా ఉంటుందని, ఇది గత ఏడాది కంటే 69 రుపాయలు ఎక్కువని అన్నారు.