వెల్గనూరులో రెండు వార్డులు ఏకగ్రీవం
MNCL: దండేపల్లి మండలంలోని వెల్గనూరు గ్రామ పంచాయతీలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆ గ్రామంలో మొత్తం సర్పంచ్, 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి ఐదుగురు, వార్డు స్థానానికి 23 మంది బరిలో నిలిచారు. మొత్తం 2,400 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్, మాజీ పీఎసీఎస్ వైస్ ఛైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.