తమిళనాడు రాష్ట్రంకు ప్రత్యేక బస్సులు

తమిళనాడు రాష్ట్రంకు ప్రత్యేక బస్సులు

తిరుపతి జిల్లా ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. పౌర్ణమి సందర్భంగా ఈనెల 8, 9 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తిరుపతి సెంట్రల్ బస్సు స్టేషన్ ఏటీఎం భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 8న ఉదయం 4 గంటల నుంచి 9న ఉదయం 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.