VIDEO: రాజగోపురంలో అమ్మవారికి పూజలు
MDK: పాపన్నపేట మండలం ఏడుపాయలలోని రాజగోపురం వద్ద గురువారం వన దుర్గ భవాని మాత ఉత్సవ విగ్రహానికి అర్చకులు పార్థివ శర్మ ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం బహుళ పక్షం పాడ్యమి పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాల పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మంగళహారతి నైవేద్యం సమర్పించారు.