'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'

E.G: బిక్కవోలు మండలం బలభద్రపురం పరిసర ప్రాంతంలో ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులతో కలసి శనివారం ధాన్యం రాశులను పరిశీలించారు. తడిచిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.