'స్వాతంత్య్రం సిద్ధించడానికి అనేక పోరాటాలు ఉన్నాయి'

HYD: నాంపల్లి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయగీతాన్ని ఆలపించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించడానికి అనేక పోరాటాలు దీని వెనక ఉన్నాయని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.