ఏపీ ప్రజలకు ధన్యవాదాలు: చంద్రబాబు

AP: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం విజయవంతం పట్ల అందరికీ ధన్యవాదాలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని చేతులమీదుగా పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరగడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారం, కేంద్ర మద్దతు, పక్కా ప్రణాళికతో అమరావతిని నిర్మిస్తామని ఉద్ఘాటించారు.