బ్యాంకు సేవలపై అవగాహన
MNCL: బ్యాంకు సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని దండేపల్లి సీఎఫ్ఎల్ కౌన్సిలర్ గుడికందుల హరీష్ కోరారు. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ప్రజలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంక్‌లోని ఖాతాలు రకాలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు, డిజిటల్ ఖాతాలు రకాలు, రుణాసౌకర్యాలు అవగాహన కల్పించారు.