'మెగా 157' టైటిల్ గ్లింప్స్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇవాళ చిరు బర్త్ డే సందర్భంగా.. దీనికి 'మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు' పేరు పెట్టినట్లు తెలుపుతూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.