మణిసాయికి రాష్ట్రపతి అవార్డు.. అభినందించిన ఎమ్మెల్యే
SRCL: రాష్ట్రపతి అవార్డు గ్రహీత మణిసాయి వర్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామని వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇటీవల అవార్డు అందుకున్న మణిసాయిని ఆది శ్రీనివాస్ నిన్న అభినందించారు. మణిసాయి వర్మను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు.