మహిళా సంఘాలకు కుర్చీలు అందజేత
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాజు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు కుర్చీలు, టేబుళ్లు అందజేశారు. ఎంపీడీవో శశికళ, గ్రామ మహిళలను శాలువా కప్పి సన్మానించారు.